యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దని, యువతను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది --- ఎస్సై గంగుల శ్రావణ్ కుమార్

 యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దని, యువతను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది 

--- ఎస్సై గంగుల శ్రావణ్ కుమార్



నిజామాబాద్ ప్రతినిధి,మార్చ్ 15 ( ఇందూర్ నేత్రం ):

నిజామాబాద్ జిల్లా భీంగల్ మండల కేంద్రంలో ని నంది గల్లి లో యువత మత్తు పదార్థాలకు బానిస కావొద్దని, యువతను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్సై గంగుల శ్రావణ్ కుమార్ అన్నారు. పట్టణంలోని నందిగల్లిలో గంజాయి,మత్తు పదార్థాల వినియోగంతో పాటు సీసీ కెమెరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గంజాయి వినియోగం పట్టణాల నుండి నేడు పల్లెలకు విస్తరిస్తుందని అన్నారు. గంజాయి సేవిస్తున్న యువతపై దృష్టి పెట్టాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై కన్నేసి ఉంచాలని తెలిపారు. గంజాయికి బానిస అయిన వ్యక్తులను రిమాండ్ కు తరలించడం జరుగుతుందని అన్నారు. గంజాయి విక్రయించినా, సేవించినా కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. గంజాయికి బానిసలుగా మారిన వారిని ప్రాథమిక దశలో గుర్తిస్తే కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నందున డీజీపీ ఆదేశాల మేరకు గంజాయి,ఇతర మత్తు పదార్థాల వినియోగంపై పోలీస్, ఎక్సైజ్ శాఖలు ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని పేర్కోన్నారు. తనిఖీలతో పాటు గంజాయి వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని ప్రజలు సహకరించాలని కోరారు. సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ సులువుగా అవుతుందని, సీసీ కెమెరాలను వార్డుల వారిగా ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సురేశ్, జలపతి, వెంకటేశ్ కౌన్సిలర్ మూతలత, లింబాద్రి, నందిగల్లి యువకులు పాల్గొన్నారు.

Popular posts
దళిత బంధు యూనిట్ల స్థాపనలో లబ్ధిదారులకే పూర్తి స్వేచ్ఛ ---కలెక్టర్ సి.నారాయణరెడ్డి వెల్లడి
Image
దళిత బంధులో ఎలాంటి అపోహలకు తావు లేదు ---లబ్ధిదారులతో ముఖాముఖిలో కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడి
Image
సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అనిర్వచనీయం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో కొనియాడిన వక్తలు ప్రభుత్వ తోడ్పాటుతో మరింతగా రాణించాలని మహిళలకు పిలుపు
Image
బైండోవర్ ఉల్లంఘించడంతో జైలుకు వెళ్లిన వ్యక్తి రెండు లక్షలు జరిమానా కట్టడంతో విడుదల--- ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టీవెన్సన్
Image