కాల్మొక్త సారూ సమస్యలు పరిష్కరించండి...
-- సర్వసభ్య సమావేశంలో ముధోల్ సర్పంచ్ ఆవేదన...
ముధోల్,మార్చ్ 6 ( ఇందూర్ నేత్రం ):
నిర్మల్ జిల్లా ముధోల్ మండల కార్యాలయంలో మండల సమావేశంలో కాల్మొక్తా సారూ గ్రామ పంచాయతీ సమస్యలు పరిష్కరించాలంటూ ముధోల్ సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ సర్వసభ్య సమావేశంలో ఆవేదనను వెళ్ళగక్కారు. శనివారం మండల కార్యాలయంలో ఎంపిపి అయేషా ఆఫ్రోజ్ ఖాన్ అధ్యక్షతన మండల సమావేశం జరిగింది . ముధోల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సెలవుపై వెళ్లడంతో అభివృద్ధి పనులతో పాటు ప్రజలకు సమస్యలు తప్పడం లేదని సర్పంచ్ సభదృష్టికి తీసుకువచ్చారు. అలాగే ముధోల్ లో అనుమతి లేని వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని సభదృష్టికి తీసుకు వచ్చారు. ముధోల్లో కొనసాగుతున్న కళ్యాణ మండపాలు గ్రామ పంచాయితీకి పన్నులు చెల్లించకున్న అధికారులు పట్టించు కోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ భూములల్లో అక్రమంగా ఇంటి నిర్మాణనాలు జరుగుతున్న వాటిని అధికారులు నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా తాను చేసిన అభివృద్ధి పనులకు నేటికీ బిల్లులు రావడం లేదని వాపోయారు. అధికారుల కక్ష సాధింపులు చేస్తూన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి హరీష్ రావు పర్యటనకు అధికారులు తమకు సమాచారం ఇవ్వకపోవడం నన్ను బాధిస్తుందని ముధోల్ ఎంపీటీసీ దేవోజి భూమేష్ సభ దృష్టికి తీసుకువచ్చారు. కావాలనే అధికారులు నాకు మంత్రికి సంబందించిన పర్యటన గురించి ఆహ్వానం ఇవ్వలేదని ఆరోపించారు. దీంతో ఎంపిటిసి సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్ళిపోయాడు, విట్టోలితాండ వద్ద రైస్ మిల్ కు లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబందించిన విద్యుత్ లైన్ నుంచి కనెక్షన్ ఇవ్వడం ఎంతవరకు సబబు అని బ్రహ్మన్ గావ్ సర్పంచ్ రామ్ రెడ్డి, విట్టోలి తండా సర్పంచ్ విజేశ్ విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నించారు. ముధోల్లో ప్రభుత్వ భూమి నుండి అక్రమంగా మొరం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ శ్యాంసుందర్ అన్నారు. ఎడ్ బీడ్ మల్లన్న ఆలయంకు వెళ్లే రోడ్డుకు విద్యుతు స్తంభాలు ఏర్పాటు చేయాలని వైస్ ఎంపిపి లావన్యరవీందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేష్ బాబు,ఏవో అజ్మీరా భాస్కర్, ఎంపీవో అశోక్, ఆయా శాఖ అధికారులు, సర్పంచ్లు,ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.