ఎన్ని జన్మలేత్తిన తల్లి రుణం తీర్చుకోలేనిది
--ప్రజ్ఞానంద బాలసరస్వతి స్వామిజి
సూర్యాపేట ప్రతినిధి,మార్చ్ 8 ( ఇందూర్ నేత్రం ):
ఎన్ని జన్మలెత్తిన తల్లి రుణం తీర్చుకోలేనిదని ప్రజ్ఞానంద బాలసరస్వతి స్వామిజి అన్నారు.మంగళవారం తెనాలి నుండి కాళేశ్వరం వెళ్తూ మార్గమధ్యలో సూర్యాపేటలోని సదాచార్ ట్రస్ట్ కన్వీనర్ ఈగ దయాకర్ గుప్త నివాసంలో కాసేపు విడిది చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేటలోని భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామిజి మాట్లాడుతూ సృష్టిలో మాతృమూర్తి రుణం ఎన్ని జన్మలెత్తినా తీసుకోలేదన్నారు. స్త్రీ మూర్తి ఎక్కడైతే గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మీ దేవి ఉంటుందన్నారు. స్త్రీ మూర్తి శాంతి, త్యాగం, సహనానికి ప్రతీక అన్నారు.నేను మరణించిన గాని బిడ్డ బ్రతకాలని కోరుకోనేది ఒక్క స్త్రీ మూర్తి మాత్రమే నని తెలిపారు. అందుకే ఆడపిల్ల పుట్టగానే లక్ష్మీదేవి జన్మనిచ్చిందని భావిస్తారని తెలిపారు.అలాంటి స్త్రీ మూర్తి ని ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు. ఈ సందర్భంగా సదాచార్ ట్రస్ట్ కన్వీనర్ ఈగ దయాకర్ గుప్తా మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున స్వామి వారు సూర్యాపేట కు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఓమ్ శ్రీ వాసవి కోటి నామ లిఖిత జపం పుస్తకాలను ఆవిష్కరించి మహిళ దినోత్సవ సందర్భంగా పలువురు మహిళలను,భక్తులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో సదాచార్ ట్రస్ట్ సభ్యులు తాళ్ళపల్లి రామయ్య,మిర్యాల శివకుమార్,బొమ్మిడి మహేష్,కర్నాటి శేఖర్,శ్రీరంగం రాము,కలకోట లక్ష్మయ్య,ఈగ విజయలక్ష్మి,మిర్యాల కవిత,తోట కమల,కలకోట అనిత,కంచర్ల లీల,కోసూరి దుర్గ,హనుమాండ్ల పుష్పలత,సుగందమాల,అరుణ మిట్టపల్లి శ్రీదేవి ,బచ్చుపురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.