ఎనిమిదవ రాష్ట్ర స్థాయి సెపక్ తాక్రా టోర్నీ కి జిల్లా జట్టు ఎంపికలు -- రాష్ట్ర అధ్యక్షులు నల్లవెళ్లి కరుణకర్ రెడ్డి

  ఎనిమిదవ  రాష్ట్ర స్థాయి సెపక్ తాక్రా టోర్నీ కి జిల్లా జట్టు ఎంపికలు



నిజామాబాద్ ప్రతినిధి,మార్చ్ 6 ( ఇందూర్ నేత్రం ):

నిజామాబాద్ కలెక్టరెట్ మైదానములో సెపక్ తక్రా రాష్ట్ర స్థాయి జూనియర్ టోర్ని కి జిల్లా బాల,బాలికల జట్లను ఎంపిక చేయడం జరిగింది.జిల్లా నలుమూల లా నుండి వచ్చిన క్రీడాకారులను వారి ప్రతిభ ఆధారముగా ఎంపిక జరిగింది ఎంపికయినా క్రీడాకారులు ఈ నెల 12,మరియు 13 వ తేదీ న ఉమ్మడి మెదక్ జిల్లా లోని గజ్వెల్ జరిగే 8 వ రాష్ట్ర స్థాయి టోర్ని పాల్గొంటారు.ఈ ఎంపిక కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు నల్లవెళ్లి కరుణకర్ రెడ్డి ముఖ్య అతిధి గా హాజరయ్యారు.అయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి లో జరిగే టోర్ని లో క్రీడా నైపుణ్యం చూహించి జిల్లా జట్లు ప్రథమ స్థానం సాధించాలని క్రీడాకారులకు సూచించారు. 

సెపక్ తక్రా  జిల్లా కార్యదర్శి గాధరి సంజీవరెడ్డి మాట్లాడుతూ.. గత సంవత్సరం ములుగు లో జరిగిన టోర్ని లో బాలికలు మొదటి స్థానం సాధించగా బాలురు ద్వితీయ స్థానం సాధించామని,ఈ సంవత్సరం తప్పకుండ ఇరు జట్లు మొదటి స్థానం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈ ఎంపిక లు కార్య నిర్వహణ కార్యదర్శి చామకురా భాగరెడ్డి,కోచ్ జి శ్యామ్ సుందర్ రెడ్డి నిర్వహించారు.జిల్లా జట్టుకు ఎంపికయినా బాలుర జట్టు ఉదయ్ కుమార్,రూత్విక్ రెడ్డి,అనీష్,విశాల్,రాహుల్,చరణ్ ఎంపికయ్యారు.

బాలికల విభాగములో సీ హెచ్ రిక్కీ రెడ్డి,సాయి ప్రణతి,లక్కీ రెడ్డి,యన్.శ్రీనీజా రెడ్డి,ప్రణవి,కీర్తన,అశ్విత ఎంపికయ్యారు.

జిల్లా జట్లకు కోచ్ లు గా బాగారెడ్డి,శ్యామ్ సుందర్ రెడ్డి,మేనేజర్ గా నందిని  వ్యవహరిస్తారు.



Popular posts
గోదావరిఖని సింగరేణి ఏరియా అసుపత్రి వద్ద ఉద్రిక్తత
Image
బైండోవర్ ఉల్లంఘించడంతో జైలుకు వెళ్లిన వ్యక్తి రెండు లక్షలు జరిమానా కట్టడంతో విడుదల--- ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టీవెన్సన్
Image
దళిత బంధు యూనిట్ల స్థాపనలో లబ్ధిదారులకే పూర్తి స్వేచ్ఛ ---కలెక్టర్ సి.నారాయణరెడ్డి వెల్లడి
Image
సైబర్ నేరాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి -- జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే‌
Image
దళిత బంధులో ఎలాంటి అపోహలకు తావు లేదు ---లబ్ధిదారులతో ముఖాముఖిలో కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడి
Image