తెలంగాణతో పోటీ పడలేకనే విమర్శలు ...! -రాష్ట్ర విద్యుత్ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

  తెలంగాణతో పోటీ పడలేకనే విమర్శలు ...!

-రాష్ట్ర విద్యుత్   మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి  



హుజుర్ నగర్  ప్రతినిధి,మార్చ్ 5 ( ఇందూర్ నేత్రం ):

దేశంలో అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రంతో పోటీ పడలేకనే  ప్రతిపక్ష నాయకులు చిల్లర విమర్శలు చేస్తున్నారని 
విద్యుత్ శాఖ   మంత్రి   గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.

శనివారం  హుజూర్‌నగర్  పట్టణంలో  ఎన్ఎస్పీ క్యాంపు  లో  రూ  .7.20 కోట్లతో  నిర్మిస్తున్న   ఇంటిగ్రేటెడ్ మార్కెట్  కు శంకుస్థాపన చేసిన అనంతరం  మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..  దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఉచితవిద్యుత్ రైతుబంధు  ,బీమా కల్యాణలక్ష్మి,షాదీముబారక్  ,ఆసరా పెన్షన్లు,కేసీఆర్ కిట్  లాంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత  తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందన్నారు. 

అదే విధంగా హుజుర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ  కాంగ్రెస్ నాయకులు  అభివృద్ధికి సహకరించకుండా  కోర్టులో కేసులు వేసి  ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత గురవుతున్నారని  వారి ఆటలు  ఎంతో కాలం సాగవన్నారు  .ఊళ్లల్లో ప్రజలు వారిని తిరిగి ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు.

 ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్పర్సన్ గెల్లీ అర్చన   రవి  ,వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు,కమిషనర్ శ్రీనివాస్రెడ్డి  ,కౌన్సిలర్లు,టీఆర్ఎస్ మహిళా విభాగం నాయకులు  పాల్గొన్నారు.

Popular posts
గోదావరిఖని సింగరేణి ఏరియా అసుపత్రి వద్ద ఉద్రిక్తత
Image
బైండోవర్ ఉల్లంఘించడంతో జైలుకు వెళ్లిన వ్యక్తి రెండు లక్షలు జరిమానా కట్టడంతో విడుదల--- ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టీవెన్సన్
Image
దళిత బంధు యూనిట్ల స్థాపనలో లబ్ధిదారులకే పూర్తి స్వేచ్ఛ ---కలెక్టర్ సి.నారాయణరెడ్డి వెల్లడి
Image
సైబర్ నేరాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి -- జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే‌
Image
దళిత బంధులో ఎలాంటి అపోహలకు తావు లేదు ---లబ్ధిదారులతో ముఖాముఖిలో కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడి
Image