బైండోవర్ ఉల్లంఘన లో మహిళకు జైలు శిక్ష..
డిచ్ పల్లి , నిజామాబాద్ ప్రతినిధి,,మార్చ్ 5 ( ఇందూర్ నేత్రం ):
నాటు సారాయిని తయారు చేస్తూ పలు మార్లు పట్టుపడిన డిచ్ పల్లి మండలం నాక తండాకు చెందిన భూక్య సంతు ను బైండోవర్ ను ఉల్లంఘించినందుకు, దానికై చెల్లించాల్సిన 2 లక్షల రూపాయలు కట్టనందుకు తహసీల్దార్, డిచ్ పల్లి శ్రీనివాస్ రావు జైలు కు పంపడం జరిగింది. నాటు సారా ను తయారు చేసిన వారు, విక్రయించిన వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని ఇట్టి సందర్భంగా ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీఐ స్టీవెన్సన్ తెలిపారు.