పోలీస్ పహారా మధ్య గ్రామ సభ... - అధిక సంఖ్యలో హాజరైన గ్రామ ప్రజలు..

 పోలీస్ పహారా మధ్య గ్రామ సభ...


- అధిక సంఖ్యలో హాజరైన గ్రామ ప్రజలు..







 




బై0సా,మార్చ్ 5 ( ఇందూర్ నేత్రం ):

నిర్మల్ జిల్లా బై0సా మండలం మహాగా0 గ్రామంలో శనివారం పోలీస్ పహారా మధ్య గ్రామ సభ జరిగింది. ఈ గ్రామ సభ ఎన్నడూ లేని విధంగా ప్రజలు హాజరయి రసవత్తరంగా సాగి0ది. గత గ్రామ సభలో సర్పంచ్ రాకేష్ పై ఉప సర్పంచ్ శారద చెప్పుతో దాడి చేయగా అప్పటి ఆ గ్రామసభ మండలంలోని దుమారం లేపింది. అందుకే శనివారం చే పట్టిన గ్రామసభను పోలీసుల పహారాలో గ్రామ ప్రజల మధ్య సాగింది. ఈ సందర్భంగా సర్పంచ్ రాకేష్ మాట్లాడుతూ... గత ఉప సర్పంచ్ శారద అభివృద్ధి పనులను అడ్డుకుని, గ్రామ అభివృద్ధికి సహకరించన0దుకె శారదను తొలగించాలని గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ జనాభాలోని 10 శాతం ప్రజలు నిర్ణయం తీసుకొని తీర్మానం చేసినట్టు తెలిపారు. ఇప్పటికే 30 లక్షల రూపాయలతో గ్రామ అభివృద్ధి పనులు ఎన్నో చేపట్టామని ఉప సర్పంచ్ చెక్కుల పై సంతకం చేయకపోవడంతో ఎన్నో అభివృద్ధి పనులు, రావాల్సిన నిధులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయని,అందుకే ఉప సర్పంచ్ శారద స్థానంలో వార్డ్ మెంబర్ సరస్వతినర్సింలు ను  గ్రామ ఉప సర్పంచ్ గా నియమించాలని గ్రామ ప్రజలు, వార్డ్ మెంబర్స్ తీర్మానం చేసామని,ఈ అజెండాను అమలు పరచమని సోమవారం ఇట్టి విషయాన్ని జిల్లా కలెక్టర్కు పంపుతూన్నట్టు అయన తెలిపారు.



Popular posts
గోదావరిఖని సింగరేణి ఏరియా అసుపత్రి వద్ద ఉద్రిక్తత
Image
బైండోవర్ ఉల్లంఘించడంతో జైలుకు వెళ్లిన వ్యక్తి రెండు లక్షలు జరిమానా కట్టడంతో విడుదల--- ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టీవెన్సన్
Image
దళిత బంధు యూనిట్ల స్థాపనలో లబ్ధిదారులకే పూర్తి స్వేచ్ఛ ---కలెక్టర్ సి.నారాయణరెడ్డి వెల్లడి
Image
సైబర్ నేరాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి -- జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే‌
Image
దళిత బంధులో ఎలాంటి అపోహలకు తావు లేదు ---లబ్ధిదారులతో ముఖాముఖిలో కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడి
Image