పిల్లల్లో సృజనాత్మకత శక్తిని పెంపొందించడానికి సైన్స్ పేయిర్
---అలరించిన గౌతమి స్కూల్ సైన్స్ పెయిర్...
-- ప్రధానోపాధ్యాయుడు రాందాస్
బై0సా ,మార్చ్ 5 ( ఇందూర్ నేత్రం ):
నిర్మల్ జిల్లా బై0సా పట్టణం లోని శ్రీ గౌతమి పాఠశాలలో శనివారం నిర్వహించిన సైన్స్ పెయిర్ కార్యక్రమం విద్యార్థుల తల్లిదండ్రులకు, పట్టణ ప్రజలను ఎంతగానో ఆకర్షించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాందాస్ మాట్లాడుతూ... పిల్లల్లో సృజనాత్మకత శక్తిని పెంపొందించడానికి సైన్స్ పేయిర్ ఎంతగానో ఉపయోగపడతాయని, సైన్స్ లోని సత్యాలను వెతికి తీయడంలో పిల్లలను ప్రోత్సహించాలని అన్నారు. పాఠశాలలో విద్యార్థులు చేసిన సోలార్ బైక్, మంకీ గన్, ఆటోమేటిక్ విద్యుత్ ఆదా వంటి ఆవిష్కరణలు పిల్లలలో ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని మెరుగు పరచాయని అన్నారు. మొత్తం 60 కి పైగా ఆవిష్కరణలు చేసి పాఠశాలలోని 90% విద్యార్థులు ఆవిష్కరణ కార్యక్రమాలలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు.