ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు
---ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్ ప్రతినిధి,ఫిబ్రవరి17 ( ఇందూర్ నేత్రం ):
టిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మొదటిసారి నిజామాబాద్ వచ్చిన సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు, శ్రేణులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారని అన్నారు. కేసీఆర్ కు ప్రాంతాలకు అతీతంగా అభిమానులు ఉన్నారని,అది డబ్బుతో కొనలేని ప్రేమ అని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని,దేశానికి నాయకత్వం వహించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.జీవన్ రెడ్డి లాంటి యువ ఎమ్మెల్యే ను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించినందుకు పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్న ప్రధాని మోడీ, అమిత్ షా లను ఇక్కడి బీజేపీ నాయకులు ఎందుకు అడగడం లేదని నిలదీశారు. తెలంగాణ అభివృద్ధి చూసి బీజేపీ ఓర్వలేక పోతున్నదని,అందుకే కుట్రలకు తెరలేపారన్నారు.రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను నోటికొచ్చినట్లుగా విమర్శిస్తున్న బిజెపి కిషన్ రెడ్డి, బండి సంజయ్,అర్వింద్ తెలంగాణ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రధాని మోదీని, అమిత్ షా ను ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు.
తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న బిజెపి పార్టీ మనకు అవసరం లేదని అన్నారు.తెలంగాణ లో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేవని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా,బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి,జడ్పీ చైర్మన్ విఠల్ రావు,నిజామాబాద్ నగర మేయర్ తదితరులు హాజరయ్యారు.