రాష్ట్రంలో కొనసాగుతున్న నిరంకుశ పాలన...బిజేపి ఎవరికి భయపడదు --ధన్ పాల్

 హుజురాబాద్‌ ఎన్నికల తర్వాత కేసిఆర్‌కు మతి తప్పింది : బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్‌ ‌సూర్యనారాయణ


‌డాక్టర్‌ ‌బి.ఆర్‌.అం‌బేద్కర్‌ అస్థిత్వమే లేకుండ చేయడానికి కేసిఆర్‌ ‌కొత్త రాజ్యాంగం...

కొత్త రాజ్యాంగం ఉంటేనే దళితులకు రైతుబంధు, మూడు ఎకరాలు పంచుతవా...

రాష్ట్రంలో కొనసాగుతున్న నిరంకుశ పాలన...బిజేపి ఎవరికి భయపడదు...

నిజామాబాదు,ఫిబ్రవరి 16(ఇందూర్ నేత్రం ):

హుజురాబాద్‌ ఉప ఎన్నికలలో సుమారు వెయ్యి కోట్లు ఖర్చుపెట్టినా ఘోరంగా ఓటమి పాలైన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌ప్రెస్టేషన్‌లో పడి ఏం మాట్లాడుతున్నడో అర్థం కాని పరిస్థితి నెలకొందని బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్‌ ‌సూర్యనారాయణ ఎద్దేవ చేశారు. ఇందూరు నగరంలో NTR చౌరస్తా నుంచి శాంతి యుతంగా పులాంగ్ అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన తెలపడానికి వెళుతం అని బయల్దేరి ముందు నా నివాసం ముందు అక్రమ అరెస్ట్ చేయడం కేసీఆర్ పతనానికి ఇది నాంది అని హెద్దేవా చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హుజురాబాద్‌లో దళిత బంధు ఇస్తామని చెప్పి ఈ అంశాన్ని తప్పుదోవ పట్టించడానికి రైతుల ఇష్యూ తీసుకొచ్చి ప్రతి గింజా నేనె కొంటానని చెప్పి కేంద్రం తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొంటలేదని కొత్త నాటకం తెరమీదకు తీసుకొచ్చి రైతుల ముందు బోర్ల బొక్కల పడ్డడు. తరుగు, రీ సైక్లింగ్‌ ‌పేరుతో ధాన్యం కొనుగోలులో సుమారు 7వేల కోట్ల స్కామ్‌... ‌కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను దానిపై విమర్శలు చేసే హక్కు ఉంది. కానీ అందులో ఏ లోపాలు తీయకుండా ప్రెస్‌మీట్‌ ‌పెట్టి భారత రాజ్యాంగం మార్చాలని కొత్త ఇష్యూను తీసుకొచ్చి డాక్టర్‌ ‌బి.ఆర్‌.అం‌బేద్కర్‌ను అవమానించి కేసిఆర్‌ ‌కొత్త రాజ్యాంగం కావాలని డిమాండ్‌ ‌చేసి అంబేద్కర్‌ అస్థిత్వమే లేకుండా చేయాలనే దురుద్ధేశ్యంతో ఇష్టం వచ్చినట్లు జుగుప్సాకరంగా మాట్లాడుతున్న మాటలను ప్రజలు గమనిస్తున్నారు. ముందు నుండి దళితులకు అవమానిస్తున్నవ్‌, ‌దళిత ముఖ్యమంత్రి అన్నడు, దళితులకు మూడు ఎకరాలు అన్నడు, దళిత బంధు అని మోసం చేసిండు. రాష్ట్రంలో కేసిఆర్‌ ‌గ్రాఫ్‌ ‌పూర్తిగా పడిపోతుంది. ఏం చేయాలో తోచక బిజేపి నాయకులు చేస్తున్న ఆందోళనలను నీరుగార్చడానికి వారిపై దాడులు చేయించడం బిజేపి చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌తలపెట్టిన జాగరణ దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు అమానుషంగా అరెస్టు చేయడం మనకు తెలుసు. గత నెలలో నందిపేటలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలకు నిజామాబాద్‌ ఎం‌పి అర్వింద్‌ ‌వెలితే టిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలతో రాళ్ల దాడులు, కత్తులతో దాడులు చేయించారు. మళ్లి గత మూడు రోజుల నుండి రాజ్యాంగం మార్చాలని పోడు భూముల సమస్యలు, దళితులకు మూడు ఎకరాల భూమి, దళిత బంధు గురించి రాజ్యాంగం కావాలని అంటున్నడు రాజ్యాంగం మారుస్తునే వీటిని అమలు చేస్తవా అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు ఏం చేసినవ్‌ ‌ధనిక రాష్ట్రాన్ని బంగారు రాష్ట్రం చేస్తానని 4లక్షల కోట్లు అప్పు చేసినవ్‌. ‌బంగారు తెలంగాణ అయిపోయింది ఇప్పుడు వజ్రాల తెలంగాణ చేస్తవా.. రైతులకు రుణాలు మాఫి కాలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు అందలేదు. సైనికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సర్జికల్‌ ‌స్ట్రైక్‌ ‌చేస్తే వారిని అవమానిస్తూ సాక్షాలు కావాలని అడుగుతవా, స్వయంగా పాకిస్తాన్‌ ‌సర్జికల్‌ ‌స్ట్రైక్‌ ‌జరిగిందని ఒప్పుకుంది. రాజ్యాంగం మారుస్తమంటే దేశ ప్రజలు భగ్గుమంటున్నరు. రాజ్యాంగాన్ని మారుస్తామని ముఖ్యమంత్రి చెబితే బిజేపి పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు శాంతియుతంగా ఆందోళనలు చేయడానికి సిద్దమైతే అక్రమ అరెస్టులతో నిర్భందిస్తున్నరు. ఇది మంచి పద్దతి కాదని బిజేపి పార్టీ ఎవరికి భయపడదని ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసం పనిచేస్తుందని అన్నారు.

Popular posts
గోదావరిఖని సింగరేణి ఏరియా అసుపత్రి వద్ద ఉద్రిక్తత
Image
బైండోవర్ ఉల్లంఘించడంతో జైలుకు వెళ్లిన వ్యక్తి రెండు లక్షలు జరిమానా కట్టడంతో విడుదల--- ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టీవెన్సన్
Image
దళిత బంధు యూనిట్ల స్థాపనలో లబ్ధిదారులకే పూర్తి స్వేచ్ఛ ---కలెక్టర్ సి.నారాయణరెడ్డి వెల్లడి
Image
సైబర్ నేరాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి -- జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే‌
Image
దళిత బంధులో ఎలాంటి అపోహలకు తావు లేదు ---లబ్ధిదారులతో ముఖాముఖిలో కలెక్టర్ నారాయణరెడ్డి వెల్లడి
Image