మహా కుంబాభిషేకంలో పాల్గొన్న ధన్‌పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్,ఫిబ్రవరి 14(ఇందూర్ నేత్రం ):
ఇందూర్ నగరంలోగల పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ శంభులింగేశ్వర ఆలయంలో సోమవారం జరిగిన శ్రీ చండికేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట, మహా కుంబాభిషేక మహోత్సవంలో బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణ పాల్గొని శ్రీ శంభులింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆలయంలో జరుగుతున్న అభివృద్ది, భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. హిందూధర్మం సనాతనమైనది దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుపై ఉందన్నారు. ఆలయ ఈవో రవింధర్ ధన్‌పాల్ సూర్యనారాయణకు ఘనంగా స్వాగతం పలికి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో చెర్మెన్ మల్కాయి మహేందర్, ఆలయ పూజారులు రాజ్‌కిరణ్, బిజేపి ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి,జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ళ లక్ష్మీ నారాయణ,కార్పొరేటర్లు మాస్టర్ శంకర్,నిచ్చేంగా కృష్ణ,మెట్టు విజయ్,ఎర్రం సుదీర్,ఈళ్లేందుల ప్రభాకర్, ప్రభాకర్,పంచరెడ్డి శ్రీధర్,వినోద్ రెడ్డి, అమందు విజయ్ కృష్ణ,తదితర బిజేపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.