నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
అతివేగానికి ఇద్దరు యువకులు బలి
నిజామాబాద్, ,జనవరి06 ( ఇందూరు నేత్రం ):
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా బైక్ నడుపుతూ ఎదురుగా వస్తున్న కారు ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కోరా గ్రామంలో జరిగింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... జక్రాన్ పల్లి మండలం తొర్లికొండ గ్రామానికి చెందిన శివ కుమార్ (21), బొజ్జ అన్వేష్ (22) లు బైక్ పై తొర్లికొండ నుంచి కమ్మర్పల్లి వెళుతుండగా లక్కోరా గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ఎదురుగా వచ్చిన కారును ఢీ కొట్టారు. ఈ సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి ఎస్ఐ భరత్ రెడ్డి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.